KDP: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై కఠిన నిఘా ఉంచాలని కడప SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. గురువారం జరిగిన నేర సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. మహిళా భద్రత, గంజాయి నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.