NZB: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జక్రాన్ పల్లి మండలం నాయనపేట గ్రామాన్ని డిచ్పల్లి సీఐ వినోద్, జక్రాన్ పల్లి ఎస్సై మహేశ్ పరిశీలించారు. గ్రామంలో ప్రజలతో సమావేశం నిర్వహించారు. సీఐ వినోద్ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బుల పంపిణీ, గుంపులుగా తిరగడం లాంటివి నిషేధించారన్నారు. అలాగే ఓటర్లను బెదిరించడం వంటివి చేయదన్నారు.