ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకాల చెల్లమ్మగారి పాలెం సమీపంలో గురువారం ఒక జాలరి చేపల వలలో పడి మృతి చెందాడు. మృతుడిని స్థానికులు జాలయ్యగా గుర్తించారు. అయితే, అతను వలలో ఎలా పడ్డాడు, ఎలా మృతి చెందాడనే దానిపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.