వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి ఆలయంలో ఇవాళ భక్తుల భారీ రద్దీ నెలకొంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో నిలుచుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనాల కోసం భక్తులు సుమారు 30 నిమిషాలకుపైగా వేచిచూడాల్సి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.