SKLM: జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఈనెల 27 నుంచి డిసెంబర్ నెల కోటాలో బియ్యం బదులుగా మూడు కిలోల వరకు రాగులు పంపిణీ చేయనున్నట్ల జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ కోటాలో బియ్యానికి బదులుగా 3 కిలోల రాగులు ఉచితంగా అందించాలన్నారు.