PPM: సబ్ కలెక్టర్ వైశాలి గురువారం సీతానగరం మండలం రామవరంలో రైస్ మిల్లును ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా రైతుల నుంచి ధాన్యం షరతులు లేకుండా తీసుకోవాలని సూచించారు. అనంతరం రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. ఎంత మంది రైతులను రిజిస్ట్రేషన్ చేశారనేది సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు.