KRNL: ఆదోని పట్టణం అమరావతి నగర్ కాలనీలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు గురువారం ఎమ్మెల్యే డా. పార్థసారథి భూమిపూజ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని, తాగునీటి సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లలితమ్మ, బీజేపీ నాయకులు మధుసూదన శర్మ, ఉపేంద్ర, యశోదమ్మ, తదితరులు పాల్గొన్నారు.