KDP: పులివెందులలోని స్థానిక సబ్ జైలులో గురువారం సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్ 15100పై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జైలు లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం, ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.