GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి జరగాల్సిన పీజీ పరీక్షల షెడ్యూల్ను వివిధ కారణాలతో రద్దు చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్ష ఫీజు చెల్లించవచ్చని సూచించారు.త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామన్నారు.