MDCL: ఉప్పల్ పరిసర ప్రాంతాలైన మల్లాపూర్, నాచారం, చిలుకా నగర్, బోడుప్పల్, మౌలాలి, ఈసీఐఎల్, కుషాయిగూడ ప్రాంతాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ గుర్తించింది. గత వారం రోజుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గినట్లు తెలిపింది. ప్రస్తుతం అత్యల్ప ఉష్ణోగ్రతలు 14 నుంచి 17 డిగ్రీలుగా నమోదు అవుతున్నాయి.