KRNL: స్నానానికి వేడి నీరు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పెద్దకడబూరుకు చెందిన వడ్డే ప్రవీణ్ కుమార్(11) మృతి చెందినట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈనెల 11న ఘటన జరగ్గా చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితికి విషమించడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు తెలిపారు.