NLR: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో నిందితుడు సుబ్రహ్మణ్యాన్ని సిట్ అధికారులు అరెస్టు చేసి నెల్లూరు ACB కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి డిసెంబర్ 10వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో అతడిని నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి అధికారులు తరలించారు. కాగా, ఆయనను తిరుపతిలో అరెస్టు చేసి రుయాలో వైద్య పరీక్షల అనంతరం నెల్లూరుకు తీసుకొచ్చారు.