GNTR: బ్రాడిపేట 2/1లో ఉన్న GDCC బ్యాంక్ సిటీ బ్రాంచ్‌ను ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు గురువారం తనిఖీ చేశారు. 1963లో అప్పటి కేంద్రమంత్రి మోరార్జీ దేశాయ్, CM నీలం సంజీవ రెడ్డి చేత నిర్మించబడిన ఈ పురాతన భవనాన్ని, రికార్డులను ఆయన పరిశీలించారు. త్వరలోనే బ్యాంకులో ఆధునికీకరణ చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు.