TPT: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన డిప్ రిజిస్ట్రేషన్‌కు రికార్డు స్థాయిలో భక్తులు స్పందించారు. తొలి గంటలోనే 2.16 లక్షలు నమోదు కాగా, సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 4,63,111 మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్‌తో పాటు ఏపీ ప్రభుత్వ వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగాయి.