KMM: కూసుమంచి మండలంలో శాశ్వత బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గురువారం తెలిపారు. కనీసం బస్సు షెల్టర్ షెడ్ అయినా ఏర్పాటు చేయాలని కోరినా అధికారుల నుంచి స్పందన లేదని మండిపడుతున్నారు. ప్రధాన రహదారిపైనే బస్సులు ఆగుతుండటంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఎండ, వానల్లో రక్షణ లేకుండా నిరీక్షించాల్సి వస్తుందన్నారు.