VZM: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమం కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామంలో ఇంఛార్జ్ మండల తహసీల్దార్ పి.సునీత ఆద్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధిక ఆదాయం వచ్చే ఉద్యాన పంటల వైపు అడుగులు వేయాలని రైతులకు హితవు పలికారు.