MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షలు ఇస్తానని బీఆర్ఎస్ నాయకుడు మామిడి మాడ భాస్కర్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని అండర్ డ్రైనేజీ, తాగునీరు వంటి అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఎన్నికల ఖర్చు గ్రామాభివృద్ధికి దోహదపడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.