ATP: పామిడి మండలం నీలూరు గ్రామంలోని పాఠశాలలో ఇవాళ NSS విద్యార్థులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల NSS ప్రాజెక్ట్ అధికారి సాకే అక్కులు ప్రతి ఇంటిలో ఒక చెట్టు నాటితే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అన్నారు.