PLD: వినుకొండలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ ప్రభాకర్ హెచ్చరించారు. పట్టణంలో నెంబర్ల ఆట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.18 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. లాడ్జీలు, గెస్ట్ హౌస్లు, ఊరి శివారుల్లో పేకాట నిర్వహించినా, ఇతర చట్టవ్యతిరేక పనులు చేసినా ఉపేక్షించేది లేదని, బాధ్యులను జైలుకు పంపుతామని సీఐ అన్నారు.