SKLM: ఆమదాలవలస పట్టణంలోని CSP రోడ్ ఫ్లైఓవర్ పై ప్రయాణికులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఫ్లైఓవర్ ఫుట్‌పాత్‌పై కింద భాగంలో ముళ్ల తుప్పలు పేరుకుపోవడం, అలాగే పైన ఎలక్ట్రికల్ వైర్లు అత్యంత ప్రమాదకరంగా వేలాడుతూ ఉండడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. రోజూ వందలాది మంది ఈ ఫ్లైఓవర్‌పై నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి ఉన్నందున, అధికారులు స్పందించాలన్నారు.