TG: ఇండస్ట్రీ పాలసీపై BRS, BJPలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వస్తే పాలసీ మారుస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ‘వాళ్లు అధికారంలోకి వచ్చేది లేదు.. పాలసీ రద్దయ్యేది లేదు’ అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఏం చేసినా అడ్డుకోవడమే పనిగా BJP పెట్టుకుందని, పాలసీని అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.