RR: బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 100 రోజుల బాల్య వివాహాల అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రచార రథాన్ని ఫరూఖ్ నగర్ మండల ఎంపీడీవో బన్సీలాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను ప్రతి ఒక్కరు అడ్డుకట్ట వేయాలన్నారు.