WPL-2026 మెగా వేలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ భారీ ధరకు అమ్ముడుపోయింది. యూపీ వారియర్స్ ఆర్టీఎమ్ కార్డును ఉపయోగించి రూ.3.20 కోట్లకు బిడ్ వేసింది. ఢిల్లీ అంత ధరకు తీసుకోవడానికి నిరాకరించడంతో యూపీ రూ.3.20 కోట్లతో తిరిగి దీప్తి శర్మను దక్కించుకుంది. అలాగే, న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్‌ను గుజరాత్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.