AP: విజయనగరం జిల్లా కొత్తవలస ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ప్రఖ్యాత పుట్బాల్ దిగ్గజం డేవిడ్ బెక్హామ్కు మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులతో ఆయన గడిపిన ప్రతిక్షణం వారికి మరపురాని అనుభవంగా మారిందన్నారు. ఆటపాటలతో పాఠశాల వాతావరణం ఉత్సవంగా మార్చిందన్నారు. పిల్లల విద్య, భవిష్యత్ కోసం ఆయన చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు.