కృష్ణా: రైతులు ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలను పండించి అధిక లాభాలను పొందవచ్చని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. గురువారం తాడిగడప గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతన్నా మీ కోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలోని అరటి, బీర వంటి పంట దిగుబడులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నేతలు, అధికారులు పాల్గొన్నారు.