TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ సహకరించట్లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. తాము అన్ని విధాలుగా ప్రయత్నించామని చెప్పారు. రిజర్వేషన్ల పక్షపాత పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే.. రిజర్వేషన్లు వచ్చేవన్నారు.