NZB: నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. గ్రామ పంచాయతి ఎన్నికల్లో భాగంగా బోధన్, నవీపేట్ డివిజన్లలోని సదుపాయాలు పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.