NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. టీడీపీ నాయకుడు బాయికాటి మధు ఆహ్వానం మేరకు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజల సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యకర్తల యోగక్షేమాలను అడిగి పరామర్శించారు.