ప్రకాశం: మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేశామని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం టంగుటూరులోని తూర్పునాయుడుపాలెంలో ఆయన మాట్లాడుతూ.. మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తానని ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారని, నేడు ఆయన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. మాట నిలబెట్టుకున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.