WGL: MGM ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు జిల్లా కలెక్టర్ సత్య శారద ఇటీవల ఆసుపత్రిలో ప్రత్యేక కంప్లెంట్ బాక్స్ ఏర్పాటు చేశారు. ఈ బాక్స్ పెట్టిన కొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. రోగులు, బంధువులకు కలిగిన అసౌకర్యాలు, సిబ్బంది-అధికారుల అవినీతిపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.