దివ్యాంగులపై జోకులు వేసిన స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగులపై అనుచితమైన జోక్స్ తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కండరాల క్షీణతతో బాధపడుతున్న వారితో కలిసి ఓ అవగాహన ప్రదర్శన ఇవ్వాలని న్యాయస్థానం సమయ్ రైనాకు సూచించింది.