TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. కాళోజీ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అవినీతి బాగోతంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రెండేళ్ల వ్యవధిలోనే స్కాంలకు చిరునామాగా మారడం దురదృష్టకరమని విమర్శించారు. పీజీ వైద్య పరీక్షల్లో ఫెయిలైన ఐదుగురు విద్యార్థులు, కొద్ది రోజులకే ఎలా పాస్ అవుతారని ప్రశ్నించారు.