MDK:ఆటో నడపడానికి వెళ్లి ఒక వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటన మాసాయిపేటలో చోటుచేసుకుంది. చేగుంట SI వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన యాదగిరి వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ కాగా, ఈనెల 24వ తేదీన ఆటో నడపడానికి ఇంటి నుండి వెళ్ళాడు. నేటికీ తిరిగి రాలేదు ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.