NRML: గురువారం ఆదిలాబాద్ జిల్లా నేరడికొండకు చెందిన అల్వే చరణ్(25) అనారోగ్య సమస్యలు, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం కారణంగా మానసికంగా వేదన చెంది సారంగాపూర్ మండలంలోని మహబూబ్ ఘాట్ వద్ద చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందాడు. ఇంటి నుంచి నిర్మల్‌కి వెళ్తానని వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేశారు.