MNCL: చెన్నూరు మండలంలో ముత్యారావ్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జట్టి మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం అతడిని పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. మల్లయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.