ప్రకాశం: దర్శి నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. కాగా, తాళ్లూరు, ముండ్లమూరు మండల ప్రజలు ప్రకాశం జిల్లాలోనే కొనసాగడానికి ఇష్టపడుతున్నారు. ఇటీవల మార్కాపురం కొత్త జిల్లా ప్రకటన విడుదల అయింది. అయితే దొనకొండ, కురిచేడు మండలాలకు మార్కాపురం దగ్గర కావటంతో కొత్త జిల్లాలో కలవటానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆ మండలాల ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.