NDL: శిరివెళ్ల (మ) జీనేపల్లి గ్రామ సచివాలయానికి రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో గ్రామస్థాయిలో అభివృద్ధి కుంటుపడుతోందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని కార్యక్రమాలకు రెగ్యులర్ కార్యదర్శి లేకపోవడం పట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలు సకాలంలో జరగడం లేదని, ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.