NTR: నందిగామ మండలం చెరువుకొమ్ముపాలెంలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, సాగునీటి సదుపాయాలు, ఎరువుల లభ్యత, పంటల మార్కెటింగ్, మద్దతు ధర వంటి అంశాలపై వివరాలు సేకరించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.