KRNL: వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలానికి సివిల్ సప్లై నుంచి ప్రభుత్వం నిర్ణయించిన లారీలో బియ్యం తరలించకుండా ఇష్టారాజ్యంగా ట్రాక్టర్లతో తరలిస్తున్నారని CPI మండల కార్యదర్శి కృష్ణ ఆరోపించారు. ఇవాళ సివిల్ సప్లై అధికారులను కలిసి మాట్లాడుతూ.. ప్రైవేట్ వాహనాల ద్వారా బియ్యాన్ని తరలిస్తే బ్లాక్ మార్కెట్కు తరలించే ప్రమాదం ఉందని, తక్షణమే ప్రైవేట్ వాహనాలను నిలిపివేయాలని కోరారు.