NLG: కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బడుగుల రామయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ గురువారం గ్రామానికి విచ్చేసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రామయ్య అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు.