కృష్ణా: గండ్రం గ్రామానికి చెందిన గుడివాడ అనుమ కుమారికి రూ.4,28,785 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ గురువారం అందజేశారు. అనారోగ్యానికి గురైన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సహకారం అందించిన సీఎం చంద్రబాబుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.