MNCL: లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాలలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆశావాహుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మండలంలోని దౌడేపల్లి క్లస్టర్ పరిధిలో మూడు గ్రామాలకు సంబంధించిన ఆశావాహులు నామినేషన్ కేంద్రానికి వచ్చి నామినేషన్లను సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్వోలు వేణుగోపాల్, శరత్, పంచాయతీ కార్యదర్శి సుజాత, పోలీసులు పాల్గొన్నారు.