CTR: పుంగనూరు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఛైర్మన్ అలీమ్ భాష అధ్యక్షతన సాఫీగా జరిగింది. గురువారం పురపాలక కార్యాలయంలో జరిగిన సమావేశంలో అజెండాలోని 7 అంశాలను ఏకగ్రీవంగా కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. తర్వాత వార్డుల్లో జరగాల్సిన అభివృద్ధి పనులు పురోగతిపై చర్చించారు. పురపాలక అభివృద్ధికి అందరు సమన్వయంతో పని చేయాలనీ ఛైర్మన్ తెలిపారు.