MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. హవేలి ఘనాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించేందుకు నామినేషన్ ప్రక్రియ నిష్పక్షపాతంగా శాంతియుతంగా జరిగేలా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా పనిచేయాలన్నారు.