NLG: దేవరకొండ మండలం కొండభీమనపల్లిలోని ప్రభుత్వ బీసీ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సాగర్ గురువారం తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం TGTUWRJC(బాలుర) కళాశాలలో ఈనెల 28 నుంచి 30 వరకు జరుగబోయే 12వ రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొంటారన్నారు.