W.G: తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వంటెద్దు సోమసుందరరావు గురువారం కన్నుమూశారు. ఆటోమొబైల్ రంగంలో దశాబ్దాల పాటు ఆయన వ్యాపార కార్యకలాపాలు సాగించారు. సోమసుందరరావు మృతి పట్ల తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.