SKLM: విభిన్న ప్రతిభావంతుల కోసం జిల్లా స్థాయి ఆటల పోటీలు ఈ 28న జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జరగనున్నాయి. డిసెంబర్ 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పోటీలను నిర్వహించనున్నట్లు సంబంధిత శాఖ సహాయ సంచాలకులు బి .శైలజ నేడు ఓ ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు అందరూ ఈ పోటీల్లో పాల్గొనాలని అన్నారు.