JGL: మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ ఛాంపియన్లకు క్షయ వ్యాధి నిర్మూలనలో తోడ్పాటు అందించడానికి స్వచ్ఛంద సంస్థ సహకారంతో శిక్షణ శిబిరం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డా. ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నివారణలో అందరూ పాలుపంచుకోవాలన్నారు. క్షయ మహమ్మారి వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు.