KMM: మధిర మండలం మాటూరుపేట గ్రామపంచాయతీ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా చిలువేరు పూర్ణమ్మ నామినేషన్ వేశారు. గురువారం పంచాయతీ కార్యాలయంలో మొదటి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆమెను నెల్లూరు రవి ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో చిలువేరు బుచ్చిరామయ్య, మాదాల రామారావు, తెల్లపరెడ్డి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.