టీమిండియా సాగిలపడితే చూడాలని అనుకుంటున్నట్లు దక్షిణాఫ్రికా కోచ్ శుక్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా స్పందించాడు. కోచ్ తన వ్యాఖ్యలను పరిశీలించుకోవాలని అన్నాడు. కోచ్‌తో సరిగా మాట్లాడే అవకాశమే రాలేదని చెప్పాడు. తన వ్యాఖ్యలపై ఏదో ఒక సందర్భంలో అతడికి మాట్లాడే అవకాశం లభిస్తుందని వెల్లడించాడు.